శ్రీమచ్ఛంకర భగవత్పాదుల విరచిత
----------------- శ్రీ కనక ధారా స్తవమ్ -----------------
------------------ (ఆట వెలదులలో ) -------------------
గణేశ స్తుతి
-----------
శ్లోకమ్: వందే వందారు మందారం ఇందిరానంద కందలమ్ |
అమందానందసందోహం బంధురం సింధురాననం ||
పద్యం: అంబకెపుడు తానె యానంద నందన
నంద మోమె తన దనవరతంబు
వందనములు సేయువారి కోర్కెలు తీర్చు
గజముఖునకు సేతు గడన యిపుడె ||
(గడన .. స్తుతి)
(తాత్పర్యము: వినయముతో నమస్కరించువారి కోరికలు తీర్చు కల్పవృక్షమువంటివాడును, పార్వతీ దేవికి సదా ఆనందం కలిగించువాడును, అపరిమిత సంతోష వదనుడును అయిన గణపతి(ని)కి నమస్కరించు(స్తుతించు)చున్నాను.
---------------------స్తవమ్ ---------------------
శ్లోకమ్: అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ |
అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా
మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ||1 ||
శ్లోకమ్: అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ |
అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా
మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ||1 ||
పద్యమ్: విష్ణు హృది తమాల వీడక నెప్పుడూ
ముదిత భృంగమోలె ముద్దులొలుకు
లక్ష్మి దృష్టి నేడు లక్షించి నాపైన
శుభములిచ్చు గాత సూడిదొసగి ||
(ముదిత భృంగి ... ఆడు తుమ్మెద)
ముదిత భృంగమోలె ముద్దులొలుకు
లక్ష్మి దృష్టి నేడు లక్షించి నాపైన
శుభములిచ్చు గాత సూడిదొసగి ||
(ముదిత భృంగి ... ఆడు తుమ్మెద)
(తాత్పర్యమ్: పూల మొగ్గలతో నిండియున్న తమూల వృక్షమును ఆశ్రయించుకొనియుండు ఆడుతుమ్మెద వలె సంతోషముతో పులకించువాడైన విష్ణుదేవుని హృదయమునే నివాసముగా చేసుకున్న ఆ ఐశ్వర్య దేవత యైన ఆ మహాలక్ష్మి చూపులు ఒకింత నాపైననూ ప్రసరించి నాకు శుభములిచ్చుగాక...)
శ్లోకమ్: ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని |
మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః ||2||
ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని |
మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః ||2||
పద్యము: కలువపైన భృంగి కదలుచుండు నటుల
కపిలుని వదనాన కమల దృక్కు
తాను తిరిగి చూడ, తడబడి, చూచెడి
లక్ష్మి నన్ను జూచు లక్షణముగ !!
(కపిలుడు ... విష్ణువు, కమల ...లక్ష్మి)
కపిలుని వదనాన కమల దృక్కు
తాను తిరిగి చూడ, తడబడి, చూచెడి
లక్ష్మి నన్ను జూచు లక్షణముగ !!
(కపిలుడు ... విష్ణువు, కమల ...లక్ష్మి)
(తాత్పర్యము: నీటి కలువలపై తుమ్మెదలు వ్రాలుతున్నట్లుగా విష్ణుదేవుని మొగమున శ్రీలక్ష్మి చూపులు ప్రసరించుచూ, స్వామి చూడగనే తత్తరపాటుతో చూపు మరల్చుకుంటూ తిరిగి చూడును. అట్టి యా చూపుల దేవి ఈ భక్తుని సైతం కరుణించి సంపదలనిచ్చుగాక...)
శ్లోకమ్: విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షం
ఆనందహేతురధికం మురవిద్విషోఽపి |
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం
ఇందీవరోదరసహోదరమిందిరాయాః || 3 ||
ఆనందహేతురధికం మురవిద్విషోఽపి |
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం
ఇందీవరోదరసహోదరమిందిరాయాః || 3 ||
పద్యము: ఇంద్రునికిని పదవి యిచ్చెడి యా తల్లి
వేడ్క కలగజేయు విష్ణువునకు
వారి జూచునట్లు వారిజ నయనయే
నన్ను జూచు గాత నయముగాను !!
వేడ్క కలగజేయు విష్ణువునకు
వారి జూచునట్లు వారిజ నయనయే
నన్ను జూచు గాత నయముగాను !!
(తాత్పర్యము: ఇంద్రునికి త్రిలోక సామ్రాజ్యమును ప్రసాదించగలదియు, నారాయణునకు ఆనందం కలిగించునదియు అయిన లక్ష్మీదేవి ఆ చూపులలో సగమైనా నా పై ప్రసరింప జేయుగాక !)
శ్లోకమ్: ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందమ్-
ఆనందకందమనిమేషమనంగతంత్రమ్ |
ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః || 4 ||
ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః || 4 ||
పద్యము: కోరి జూచు హరిని వారిజ నయనయు
ఓరగంట జూచు ఒప్పుగాను
కొసరు దృష్టి దయతొ కొంతైన ప్రసరించి
శుభములిచ్చు గాత శౌరి పత్ని !!
ఓరగంట జూచు ఒప్పుగాను
కొసరు దృష్టి దయతొ కొంతైన ప్రసరించి
శుభములిచ్చు గాత శౌరి పత్ని !!
(తాత్పర్యము: కోరికతో నిండిన అరమోడ్పు కన్నులతో తనను చూచుచున్న శ్రీహరిని ప్రేమతో రెప్పవేయకుండ కంటి కొసలతో వీక్షించే ఆ ఇందిరా దేవి కొంచెం నా వైపు కూడా చూచి శుభములిచ్చుగాక...)
శ్లోకము: కాలాంబుదాళిలలితోరసి కైటభారేః
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ |
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః || 5 ||
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ |
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః || 5 ||
పద్యము: కారు మబ్బు లందు కాంతి రేఖవలెనె
విష్ణు వెడద పైన వెలుగుచుండు
లక్ష్మి దివ్య రూపె లక్షణముగ నుండె
చూపె చాలు నాకు శుభము లివ్వ!!
విష్ణు వెడద పైన వెలుగుచుండు
లక్ష్మి దివ్య రూపె లక్షణముగ నుండె
చూపె చాలు నాకు శుభము లివ్వ!!
(తాత్పర్యము: కారు మబ్బుల మీద కాంతిరేఖలవలెనే విష్ణు హృదయముపై మెరసిపోవు లక్ష్మీ దేవి దివ్య స్వరూపమే నాకునూ సర్వశుభములిచ్చు గాక)
శ్లోకమ్: బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి |
కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా
కళ్యాణమావహతు మే కమలాలయాయాః || 6 ||
హారావళీవ హరినీలమయీ విభాతి |
కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా
కళ్యాణమావహతు మే కమలాలయాయాః || 6 ||
పద్యము: కౌస్తుభముతొ మెరయు కపిలుని హృది తాకి
ఇంద్ర నీల మణిల యినుమడించు
కోర హరివియైన కోరికలే దీర్చు
అట్టి లక్ష్మి చూపె ఆదరించు !!
ఇంద్ర నీల మణిల యినుమడించు
కోర హరివియైన కోరికలే దీర్చు
అట్టి లక్ష్మి చూపె ఆదరించు !!
(తాత్పర్యము: కౌస్తుభమణితో వెలిగే ఆ శ్రీహరి హృదయంపై ప్రసరించి ఇంద్రనీల మణులను మరిపించునట్లుగాను, భర్తయైన శ్రీహరి కోరకలను సైతం తీర్చగలవి యైన ఆ శ్రీదేవి చూపులు నాకున్నూ శుభములొసంగు గాక...)
శ్లోకమ్: ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన |
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం
మందాలసం చ మకరాలయకన్యకాయాః || 7 ||
మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన |
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం
మందాలసం చ మకరాలయకన్యకాయాః || 7 ||
పద్యము: లక్ష్మి చూపు వలనె లక్షణముగ హరి
విశ్వ రక్షణందు విజయుడాయె
మమ్మునట్లె జూచు మకరాలయ తనయ
తనదు దృక్కుతోడ ధన్యుడగుదు !!
విశ్వ రక్షణందు విజయుడాయె
మమ్మునట్లె జూచు మకరాలయ తనయ
తనదు దృక్కుతోడ ధన్యుడగుదు !!
(మకరాలయం... మొసళ్ల నిలయం... సాగరం)
(తాత్పర్యము: మంగళ స్వరూపిణి యైన శ్రీ లక్ష్మి కడకంటి చూపు తనపై ప్రసరించడం వల్లనే శ్రీహరి లోకరక్షా కార్యక్రమంలో విజయుడవుతున్నాడు. అట్టి క్షీరసాగర కన్య క్రీగంటి చూపు నన్ను సైతం ధన్యుని చేయుగాక)
(తాత్పర్యము: మంగళ స్వరూపిణి యైన శ్రీ లక్ష్మి కడకంటి చూపు తనపై ప్రసరించడం వల్లనే శ్రీహరి లోకరక్షా కార్యక్రమంలో విజయుడవుతున్నాడు. అట్టి క్షీరసాగర కన్య క్రీగంటి చూపు నన్ను సైతం ధన్యుని చేయుగాక)
శ్లోకమ్: దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా-
మస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే |
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
నారాయణప్రణయినీనయనాంబువాహః ||8 ||
మస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే |
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
నారాయణప్రణయినీనయనాంబువాహః ||8 ||
పద్యము: సెగకు వడలినట్టి శిశు విహంగమువోలె
పాపములను చేసి పరితపించు
నన్ను మేఘమాల నయము గా పక్షినే
చూచునట్లు లక్ష్మి చూచు గాక !!
(నయముగ ప్లస్ ఆ)
పాపములను చేసి పరితపించు
నన్ను మేఘమాల నయము గా పక్షినే
చూచునట్లు లక్ష్మి చూచు గాక !!
(నయముగ ప్లస్ ఆ)
(తాత్పర్యము: ఎండలకు వడలిన (చాతక) పక్షి శిశువు మేఘాల నుంచి వీచే గాలితోనే తృప్తి చెందినట్లు పాపాలతో పరితపించే ఈ అభాగ్యుని ఆ లక్ష్మీదేవి తన చూపులతో కృతార్థుని చేయుగాక...)
శ్లోకమ్: ఇష్టా విశిష్టమతయోఽపి యయా దయార్ద్ర
దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే |
దృష్టిః ప్రహృష్ట కమలోదరదీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః || 9 ||
దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే |
దృష్టిః ప్రహృష్ట కమలోదరదీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః || 9 ||
పద్యము: యాజులేమి కారు వ్యాజములేనట్టి
భార్గవి కన వారె భాగ్యులైరి
పద్మ వర్ణమున్న పద్మవాసినియైన
దేవి మమ్ము జూచి దీవెనిచ్చు !!
(యాజులు .... యాగాలు చేయువారు)
భార్గవి కన వారె భాగ్యులైరి
పద్మ వర్ణమున్న పద్మవాసినియైన
దేవి మమ్ము జూచి దీవెనిచ్చు !!
(యాజులు .... యాగాలు చేయువారు)
(తాత్పర్యము: యజ్ఞ యాగాదులు చేయకపోయిననూ ఆ మహాదేవి(భార్గవి) చూచిన తోడనే సామాన్య మానవులు సహితం దేవేంద్ర పదవి పొదగలుగుతున్నారు. అంటే భాగ్యశాలురు కాగలుగుతున్నారు కదా. అట్టి పద్మాసనయైన, పద్మ వర్ణమే కలిగి యున్న శ్రీ మహాలక్ష్మి చూపు మాపై కూడా ప్రసరించు గాక...)
శ్లోకమ్: గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి
శాకంభరీతి శశిశేఖరవల్లభేతి |
సృష్టిస్థితిప్రళయకేలిషు సంస్థితాయై
తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై || 10 ||
శాకంభరీతి శశిశేఖరవల్లభేతి |
సృష్టిస్థితిప్రళయకేలిషు సంస్థితాయై
తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై || 10 ||
పద్యము: సృష్టి కాలమందు స్రష్టకు పత్నియై
సాకు నపుడు విష్ణు సతియు గాను
శశిధరునికి దేవి శాకంభరీ దేవి
వందనములు కమల వంద వేలు !!
సాకు నపుడు విష్ణు సతియు గాను
శశిధరునికి దేవి శాకంభరీ దేవి
వందనములు కమల వంద వేలు !!
(తాత్పర్యము: సృష్టి కాలమున బ్రహ్మ పత్నియైన సరస్వతి అనియూ, పోషణ కాలములో నారాయణుని పత్ని యైన లక్ష్మి అనియూ, ప్రళయ కాలములో రుద్రుని సతియైన పార్వతి అనియూ, భక్తులను అనుగ్రహించుటలో అన్నపూర్ణ(శాకంభరి) అనియూ చెప్పబడుచున్న ఆ శ్రీ మహాలక్ష్మికి వందనములాచరిస్తున్నాను.)
శ్లోకమ్: శ్రుత్యై నమోఽస్తు శుభకర్మఫలప్రసూత్యై
రత్యై నమోఽస్తు రమణీయగుణార్ణవాయై |
శక్త్యై నమోఽస్తు శతపత్రనికేతనాయై
పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమవల్లభాయై || 11||
రత్యై నమోఽస్తు రమణీయగుణార్ణవాయై |
శక్త్యై నమోఽస్తు శతపత్రనికేతనాయై
పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమవల్లభాయై || 11||
పద్యము: విహిత కర్మలకును వేద స్వరూపిణి
సద్గుణములకెపుడు సంతసించు
పద్మవాసినగుచు పసిడి, శక్తుల నిచ్చు
వందనాలు లక్ష్మి వందవేలు
(విహిత కర్మలు ... చేయదగినవి)
సద్గుణములకెపుడు సంతసించు
పద్మవాసినగుచు పసిడి, శక్తుల నిచ్చు
వందనాలు లక్ష్మి వందవేలు
(విహిత కర్మలు ... చేయదగినవి)
(తాత్పర్యము: శుభ(విహిత) కర్మలకు మూలకారణమైన వేదస్వరూపిణియు, మహోన్నత గుణములకు పుట్టినిల్లయిన ఆనందరూపిణియు,పద్మే పీఠముగాగల శక్తి రూపిణియు, సకల సంపత్ స్వరూపిణియునైన ఆ విష్ణు పత్నికే శత సహస్ర వందనములు.)
శ్లోకమ్: నమోఽస్తు నాళీకనిభాననాయై
నమోఽస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై |
నమోఽస్తు సోమామృతసోదరాయై
నమోఽస్తు నారాయణవల్లభాయై || 12 ||
నమోఽస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై |
నమోఽస్తు సోమామృతసోదరాయై
నమోఽస్తు నారాయణవల్లభాయై || 12 ||
పద్యము: పంకజాక్షి తానె పాలకడలి సుత
అరసి జూడ నెపుడు యమృతమునకు
శశికి సైతమాయె సహజాత యా దేవి
వందనాలు విష్ణు వల్లభికిని !!
అరసి జూడ నెపుడు యమృతమునకు
శశికి సైతమాయె సహజాత యా దేవి
వందనాలు విష్ణు వల్లభికిని !!
(తాత్పర్యము: తామర పువ్వు వంటి ముఖము, పాలకడలి తనయ, చంద్రునికీ, అమృతానికీ కూడా సోదరి ఆయిన విష్ణు మూర్తి పత్నికి వందనాలు..)
శ్లోకమ్: నమోఽస్తు హేమాంబుజ పీఠికాయై
నమోఽస్తు భూమండల నాయికాయై |
నమోఽస్తు దేవాది దయాపరాయై
నమోఽస్తు శార్ఙ్గాయుధ వల్లభాయై || 13 ||
నమోఽస్తు భూమండల నాయికాయై |
నమోఽస్తు దేవాది దయాపరాయై
నమోఽస్తు శార్ఙ్గాయుధ వల్లభాయై || 13 ||
పద్యము: పసిడి కలువ నందు భద్రముగ గూర్చున్న
పంక్తి నాయకీవె ప్రణతులిత్తు
సురలపైన దయయు కురిపించు తల్లివీ
వందనము మురారి వల్లభికిని...
(పంక్తి ... విశ్వము, ఈవు.... నీవు కు రూపాంతరము)
పంక్తి నాయకీవె ప్రణతులిత్తు
సురలపైన దయయు కురిపించు తల్లివీ
వందనము మురారి వల్లభికిని...
(పంక్తి ... విశ్వము, ఈవు.... నీవు కు రూపాంతరము)
(తాత్పర్యము: బంగారు తామరపువ్వు యందు కూర్చున్న దేవికి వందనం. సమస్త భూ మండల(పంక్తి) నాయకికి వందనం. సకల దేవతలను కరుణించు అమ్మకు వందనం. శార్జ్ఞ మను విల్లు ధరించిన మురారి పత్నికి వందనాలు.
.)
శ్లోకమ్: నమోఽస్తు దేవ్యై భృగునందనాయై
నమోఽస్తు విష్ణోరురసిస్థితాయై |
నమోఽస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోఽస్తు దామోదరవల్లభాయై || 14 ||
నమోఽస్తు విష్ణోరురసిస్థితాయై |
నమోఽస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోఽస్తు దామోదరవల్లభాయై || 14 ||
పద్యము: భార్గవికిదె సేతు ప్రణతులె యెన్నెన్నొ
కపిల హృదయ స్థితకు కరము లెత్తి
కమలవాసి తానె కైమోడ్పు నే సేతు
వందనములు తల్లి వంద వేలు !!
కపిల హృదయ స్థితకు కరము లెత్తి
కమలవాసి తానె కైమోడ్పు నే సేతు
వందనములు తల్లి వంద వేలు !!
(తాత్పర్యము: భృగు మహర్షి కుమార్తె యైన భార్గవికి నమస్కారము. విష్ణుమూర్తి హృదయమందే వసించియుండు లక్ష్మికి వందనము. పద్మమే నివాసముగా గల కమలాక్షి, శ్రీమన్నారాయణుని ప్రియసఖి యైన మా తల్లికి శతాధిక వందనాలు.)
శ్లోకమ్: నమోఽస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోఽస్తు భూత్యై భువనప్రసూత్యై |
నమోఽస్తు దేవాదిభిరర్చితాయై
నమోఽస్తు నందాత్మజవల్లభాయై || 15 ||
నమోఽస్తు భూత్యై భువనప్రసూత్యై |
నమోఽస్తు దేవాదిభిరర్చితాయై
నమోఽస్తు నందాత్మజవల్లభాయై || 15 ||
పద్యము: కమల నయన మరియు కాంతి స్వరూపిణి
పంక్తి సృజన కర్త భాగ్య రూపి
సురల పూజలందు మురళీధరుని పత్ని
వందనములు లక్ష్మి వంద వేలు...!!
పంక్తి సృజన కర్త భాగ్య రూపి
సురల పూజలందు మురళీధరుని పత్ని
వందనములు లక్ష్మి వంద వేలు...!!
(తాత్పర్యము: కాంతి స్వరూపిణి, కమల నయన, జగత్ (పంక్తి) సృష్టికి కారణ భూతురాలు, భాగ్య రూపిణి, దేవతలతో పూజలందుకునే దేవియు, మురారి పత్నియునైన యా లక్ష్మీదేవికి శతసహస్ర వందనాలు...
.)
శ్లోకమ్: సంపత్కరాణి సకలేంద్రియనందనాని
సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి |
త్వద్వందనాని దురితాహరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు మాన్యే || 16 ||
సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి |
త్వద్వందనాని దురితాహరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు మాన్యే || 16 ||
పద్యము: వందనములతోటి వదలు నా పాపాలు
ఇంద్రియముల ముదమె యినుమడించు
రాజ్యములనె యిచ్చు రహితోడ సంపదల్
ఒసగు తల్లికిత్తు నొరిగలెన్నొ ... !!
ఇంద్రియముల ముదమె యినుమడించు
రాజ్యములనె యిచ్చు రహితోడ సంపదల్
ఒసగు తల్లికిత్తు నొరిగలెన్నొ ... !!
(తాత్పర్యము: తల్లీ ! నీకు చేయు నమస్కారము(ఒరిగ)లతోనే నా పాపాలు హరిస్తాయి. సకలేంద్రియాలు అలౌకికానందం పొందుతాయి. సంపదలు కలుగుతాయి. కడకు సామ్రాజ్యాలే దక్కవచ్చు కదా...)
శ్లోకమ్: యత్కటాక్షసముపాసనావిధిః
సేవకస్య సకలార్థసంపదః |
సంతనోతి వచనాంగమానసైః
త్వాం మురారిహృదయేశ్వరీం భజే || 17 ||
సేవకస్య సకలార్థసంపదః |
సంతనోతి వచనాంగమానసైః
త్వాం మురారిహృదయేశ్వరీం భజే || 17 ||
పద్యము: కొలువు మాత్రముననె కోరిన సంపదల్
అమల! నీదు వీక్ష యందజేయు
కరుణ మూర్తి నీవె కమలాక్షు దేవేరి!
త్రికరణముగ గొల్తు తృప్తి దీర!!
(అమల అనగా లక్ష్మికి మరోపేరు, వీక్ష అనగా దృష్టి)
అమల! నీదు వీక్ష యందజేయు
కరుణ మూర్తి నీవె కమలాక్షు దేవేరి!
త్రికరణముగ గొల్తు తృప్తి దీర!!
(అమల అనగా లక్ష్మికి మరోపేరు, వీక్ష అనగా దృష్టి)
(తాత్పర్యము: తల్లీ! నిన్ను సేవించిన వారికి, నీ దృష్టి ప్రసరించినంతనే కోరిన సంపదలు లభిస్తాయి. అట్టి దయామూర్తివైన నిన్నే మనో వాక్కాయ కర్మల శుద్ధిగా సేవించుకున్నాను.)
శ్లోకమ్: సరసిజనిలయే సరోజహస్తే
ధవళతమాంశుకగంధమాల్యశోభే |
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ || 18 ||
ధవళతమాంశుకగంధమాల్యశోభే |
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ || 18 ||
పద్యము: 1. అంబుజమున నుందు వంబుజ హస్తవే
కట్టు గౌర వర్ణ పట్టు చీరె!
గంధములను కలిగి కాంతిల్లు భగవతి
వందనాలు లక్ష్మి వందవేలు !!
కట్టు గౌర వర్ణ పట్టు చీరె!
గంధములను కలిగి కాంతిల్లు భగవతి
వందనాలు లక్ష్మి వందవేలు !!
2. వాడుటెరుగనవియె వాసియైనవి పూలు
నీదు వెల్గులకును నిత్య వెలుగు!
మూడు లోకములకు వీడక సంపదల్
అందజేయు తల్లి, యాదరించు !!
నీదు వెల్గులకును నిత్య వెలుగు!
మూడు లోకములకు వీడక సంపదల్
అందజేయు తల్లి, యాదరించు !!
(తాత్పర్యము: తామర కొలనులో ఉంటూ చేత తామర పూవులున్న దేవీ! తెల్లని (గౌర వర్ణం) పట్టు చీరె కట్టి, గంధం పూతతోనూ, వసివాడని పూలతోనూ ప్రకాశిస్తున్న తల్లీ! (నిజానికి నీ వల్లే ఆ గంధానికీ, పూలకూ వెలుగులు కదా!) ముల్లోకాలకూ ఐశ్వర్య(భూతి) ప్రదాతా ! నీకివే శతసహస్ర వందనాలు !!)
శ్లోకమ్: దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీమ్ |
ప్రాతర్నమామి జగతాం జననీమశేష
లోకాధినాథగృహిణీమమృతాబ్ధిపుత్రీమ్ || 19 ||
స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీమ్ |
ప్రాతర్నమామి జగతాం జననీమశేష
లోకాధినాథగృహిణీమమృతాబ్ధిపుత్రీమ్ || 19 ||
పద్యము: దిగ్గజములు చేరి దీప్తక ఘటముల
జలకమాడ చేయ జనని వెలుగు
విశ్వ నాథ గృహిణి వేల్పుబోనము పుత్రి
వందనములు సేతు వందవేలు !!
(దీప్తక ఘటములు అనగా సువర్ణభాండములు, వేల్పుబోనము అనగా అమృతము మరో అర్థములో దేవతల భోజనమే)
జలకమాడ చేయ జనని వెలుగు
విశ్వ నాథ గృహిణి వేల్పుబోనము పుత్రి
వందనములు సేతు వందవేలు !!
(దీప్తక ఘటములు అనగా సువర్ణభాండములు, వేల్పుబోనము అనగా అమృతము మరో అర్థములో దేవతల భోజనమే)
(తాత్పర్యము: దిగ్గజములు సువర్ణ పాత్ర గంగా జలములతో అభిషేకించుటచే తడిసిన దేహముతో వెలుగులు చిమ్మునదియు, లోకాధినాథుని గృహిణి, అమృతాబ్ధి పుత్రియైన లక్ష్మికి శతసహస్ర వందనాలు)
శ్లోకమ్: కమలే కమలాక్షవల్లభే త్వం
కరుణాపూరతరంగితైరపాంగైః |
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః || 20 ||
కరుణాపూరతరంగితైరపాంగైః |
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః || 20 ||
పద్యము: లేమినందు నేనె లెక్కింప ప్రథముడ
తగుదు నెపుడు నీదు దయకు నేనె
కనుకె నీవె, కమల! కమలాక్షు వల్లభీ !
కను కొసలను జూడు కరుణతోడ !!
తగుదు నెపుడు నీదు దయకు నేనె
కనుకె నీవె, కమల! కమలాక్షు వల్లభీ !
కను కొసలను జూడు కరుణతోడ !!
(తాత్పర్యము: కమలాక్షుని రాణివైన ఓ కమలా దేవీ! దరిద్రులలో మొదటివాడిని నేను. నీ దయకు పాత్రుడను. కనుక కరుణతో నిండిన నీ కంటి కొసలనుంచి ఐనా చూడుము...)
శ్లోకమ్: బిల్వాటవీ మధ్య లసత్సరోజే
సహస్రపత్రే సుఖ సన్నివిష్టామ్ |
అష్టాపదామ్భెరుహ పాణి పద్మాం
సువర్ణ వర్ణాం ప్రణమామి లక్ష్మీమ్ || 21 ||
సహస్రపత్రే సుఖ సన్నివిష్టామ్ |
అష్టాపదామ్భెరుహ పాణి పద్మాం
సువర్ణ వర్ణాం ప్రణమామి లక్ష్మీమ్ || 21 ||
పద్యము: బిల్వ వనము నందు కల్వల కొలనులో
వేయి రేక లున్న విరియె గద్దె
హస్తమందు కమల హాటక వర్ణవే
వందనాలు లక్ష్మి వందవేలు !!
( బిల్వ వనము ... మారడు వనము, హాటకము ... బంగారం)
వేయి రేక లున్న విరియె గద్దె
హస్తమందు కమల హాటక వర్ణవే
వందనాలు లక్ష్మి వందవేలు !!
( బిల్వ వనము ... మారడు వనము, హాటకము ... బంగారం)
(తాత్పర్యము: బిల్వ వృక్షాలున్న వనములోని కొలనులో వేయి రేకలున్న తామర పుష్పమందు సుఖాసీనురాలై, బంగారు తామరలను చేత ధరించి హంగారం రంగుతో మెరిసిపోతున్న లక్ష్మీదేవికి శతసహస్ర వందనాలు...)
శ్లోకమ్: కమలాసన పాణినాలలాటే
లిఖితా మక్షర పంక్తి మస్య జంతోః
పరిమార్జయ మాత రంఘ్రిణా తే
ధనిక ద్వార నివాస దుఃఖ దోగ్ధ్రీమ్ || 22 ||
లిఖితా మక్షర పంక్తి మస్య జంతోః
పరిమార్జయ మాత రంఘ్రిణా తే
ధనిక ద్వార నివాస దుఃఖ దోగ్ధ్రీమ్ || 22 ||
పద్యము: ధాత నొసట వ్రాసె ధనికుల ముంగిట
యాచకునిగ జీవయాన మకట !
ధాత మాత ! నీవు దయగల తల్లివే
చరణములనె సాచి చెరిపివేయి !!
(ధాత మాత ... ధాతకు తండ్రి విష్ణువు గనుక లక్ష్మి ఆయనకు తల్లితో సమానమే కదా)
యాచకునిగ జీవయాన మకట !
ధాత మాత ! నీవు దయగల తల్లివే
చరణములనె సాచి చెరిపివేయి !!
(ధాత మాత ... ధాతకు తండ్రి విష్ణువు గనుక లక్ష్మి ఆయనకు తల్లితో సమానమే కదా)
((తాత్పర్యము: ఓ మాతా ! విధాత ఈ జీవి నుదుట ధనికుల ఇండ్లముందు నిలబడి వారిచ్చుదానితోనే బ్రదుకమని వ్రాసినాడు తల్లీ. నీవు దయగల దానివి గనుక నీ కమల చరణములను సాచి ఆ రాతలను తుడిచివేయి మాతా...!)
శ్లోకమ్: అంభోరుహం జన్మగృహం భవత్యా
వక్షస్థలం భర్తృగృహం మురారేః
కారుణ్యతః కల్పయ పద్మవాసే
లీలా గృహం మే హృదయారవిందమ్ || 23 ||
వక్షస్థలం భర్తృగృహం మురారేః
కారుణ్యతః కల్పయ పద్మవాసే
లీలా గృహం మే హృదయారవిందమ్ || 23 ||
పద్యము: కమల మందు బుట్టి కమలాక్షు యెద మెట్ట
లేమి యన్న దేమి లేదు నీకు !
అయిన నేమి నాదు నంతరంగము నీదు
బయలుగానె దలచి బయిసి చూపు !!
(బయలు.... మైదానం అనగా క్రీడాస్థలమే, బయిసి అనగా కరుణ)
లేమి యన్న దేమి లేదు నీకు !
అయిన నేమి నాదు నంతరంగము నీదు
బయలుగానె దలచి బయిసి చూపు !!
(బయలు.... మైదానం అనగా క్రీడాస్థలమే, బయిసి అనగా కరుణ)
(తాత్పర్యము: పద్మములో పుట్టి, శ్రీహరి ఎదనే మెట్టినిల్లుగా చేసుకున్న నీకు లోటు అనదే లేదని నాకునూ ఎరుకే. అయినప్పటికీ ఓ మాతా ! నా హృదయాన్ని నీ ఆట స్థలముగా చేసుకోవడం ద్వారా నాపై ఇంత కరుణ చూపవమ్మా !!)
శ్లోకమ్: స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ |
గుణాధికా గురుతరభాగ్యభాజినో
భవంతి తే భువి బుధభావితాశయాః || 24 ||
త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ |
గుణాధికా గురుతరభాగ్యభాజినో
భవంతి తే భువి బుధభావితాశయాః || 24 ||
పద్యము: మూడు వేదములకు మూలరూపిణి యామె
మూడు లోకములను ముద్దు చేయు
కనక ధార స్తవము మనన చేసిన కల్గు
గుణము, భాగ్యములును, గణన సుతయు !!
మూడు లోకములను ముద్దు చేయు
కనక ధార స్తవము మనన చేసిన కల్గు
గుణము, భాగ్యములును, గణన సుతయు !!
(తాత్పర్యము: మూడు వేదాల రాశియైన స్వరూపమ గలదియు, ముల్లోకములకు తల్లియు నైన ఆ మహా లక్ష్మీ దేవిని ఈ కనక ధారా స్తవముతో స్తుతించిన యెడల సద్గుణ సంపదయు, కీర్తియు లభించు గాత !)
---------- ఫల శృతి ------------
శ్లోకమ్: సువర్ణ ధారా స్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితమ్
త్రిసంధ్యం యః పఠేన్నిత్యమ్ స కుబేర సమో భవేత్ || 25 ||
త్రిసంధ్యం యః పఠేన్నిత్యమ్ స కుబేర సమో భవేత్ || 25 ||
పద్యము: కం. శంకర విరచిత స్తవమునె
వంకర లేనట్టి హృదిని వదలక యెవరున్
శంకలు మానుచు సతతము
సంకల్పము తోడ జదువ సములౌ ధనితోన్ !!
(ధని అనగా ధనికుడు ... కుబేరుడే)
(తాత్పర్యము: శంకరాచార్య విరచితమైన ఈ కనక దారా స్తవమును ఏ విధమైన శంకలూ లేకుండా స్థిరమైన బుద్ధితో నిత్యమూ సంకల్పము చెప్పుకుంటూ చదివిన యెడల కుబేరునితో సమానమగుదురుగాక...)
వంకర లేనట్టి హృదిని వదలక యెవరున్
శంకలు మానుచు సతతము
సంకల్పము తోడ జదువ సములౌ ధనితోన్ !!
(ధని అనగా ధనికుడు ... కుబేరుడే)
(తాత్పర్యము: శంకరాచార్య విరచితమైన ఈ కనక దారా స్తవమును ఏ విధమైన శంకలూ లేకుండా స్థిరమైన బుద్ధితో నిత్యమూ సంకల్పము చెప్పుకుంటూ చదివిన యెడల కుబేరునితో సమానమగుదురుగాక...)
* * * * * * * * * శు భ మ్ * * * * * * * * *
ఇతి శ్రీమచ్ఛంకర భగవత్పాదుల విరచిత శ్రీ కనక ధారా స్తవమునకు పద్య రూప కల్పనా ప్రక్రియ పరిసమాప్తం....
ఇతి శ్రీమచ్ఛంకర భగవత్పాదుల విరచిత శ్రీ కనక ధారా స్తవమునకు పద్య రూప కల్పనా ప్రక్రియ పరిసమాప్తం....
No comments:
Post a Comment